
చెన్నై: బెలూన్ ఊదుతూ గొంతులో ఇరుక్కోవడంతో ఆరేళ్ల బాలుడు చనిపోయిన సంఘటన తమిళనాడులోని వచ్చూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... వస్త్ర వ్యాపారి సత్యకుమార్ అనే వ్యక్తికి కవల పిల్లల ఉన్నారు. సోమనాథ్ అనే ఆరేళ్ల బాలుడు బెలూన్‌తో ఆడుకుంటున్నాడు. బెలూన్ గాలి ఉదుతూ నోట్లోకి లాగుతున్నాడు. బెలూన్ ఒక్కసారిగా గొంతులోకి వెళ్లింది. ఊపిరాడక ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే బాలుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. బాలుడి చనిపోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.











