
న్యూఢిల్లీ : ఈ20 పెట్రోల్ స్థానంలో ఈ10ను తీసుకొస్తున్నారనే వార్తలను భారత్ పెట్రోలియం (బిపిసిఎల్) ఖం డించింది. బిపిసిఎల్ చైర్మన్ సంజయ్ ఖన్నా మాట్లాడుతూ ఈ20ని తీసివేసి ఈ10 అమలు చేసే ఆలోచన లేదని స్పష్టం చేశా రు. అయితే 7.5 నుండి 8 కోట్ల పాత ద్విచక్ర వాహనాల కోసం ఈ10 పెట్రోల్‌ను అదనపు ఆప్షన్‌గా ఇవ్వాలా వద్ద అనే చర్చ మాత్రమే జరుగుతోందన్నారు. ఒకవేళ ప్రభుత్వం నిర్ణ యం తీసుకున్నా సరఫరాలో ఇబ్బంది ఉండదని చెప్పారు. కానీ ఈ20తో పాటు ఈ10ను వేరుగా అమ్మడం సవాలుతో కూడుకున్నదని చమురు మంత్రిత్వ శాఖ తెలిపింది.











