మహారాష్ట్రలోని బారామతి ఎయిర్‌ఫీల్డ్‌లో ఓ శిక్షణా విమానం ప్రమాదానికి గురైంది. కార్వర్ ఏవియేషన్‌కు చెందిన విటి-ఎస్ఇఎక్స్ విమానం రన్‌వేపై నుంచి జారిపోయింది. ఈ ఘటనలో విమానం స్వల్పంగా దెబ్బ తినగా.. అందులో ఉన్న పైలట్లు సురక్షితంగా బయటపడినల్లు అధికారులు తెలిపారు. ల్యాండింగ్ అనంతరం రన్‌వేపై విమానం నిర్దేశిత ప్రదేశంలో ఆగలేదని.. రన్‌వేను దాటి సుమారు 20 అడుగుల ముందున్న మైదాన ప్రాంతంలోకి దూసుకెళ్లిందని చెప్పారు.

ఏడు నెలల క్రితం ఇదే ప్రాంతంలో మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ చార్టర్ విమానం ప్రమాదానికి గురైంది. ఆ ఘటనలో అజిత్ సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం మే 13న మరో శిక్షణా విమానం సాంకేతిక సమస్య కారణంగా ఈ ఎయిర్‌ఫీల్డ్‌లోనే కూలిపోయింది. అయితే ఈ ఘటనలో పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు.