
న్యూఢిల్లీ : పశ్చిమబెంగాల్‌లో అధికాక తృణమూల్ కాంగ్రెస్ భయానక పాలన సాగుతోందని కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దేబ్‌దీప్ ఛటర్జీ ఇటీవలే దారుణ హత్యకు గురయ్యారు. టిఎంసి గూండాలే ఈ దారుణానికి పాల్పడ్డట్లు ఆరోపణలు వెలువడ్డాయి. అధికార దర్పంతో వ్యవహరిస్తున్న టిఎంసి సంబంధిత వ్యక్తులు తమ పార్టీ కార్యకర్తపై దాడికి దిగి తీవ్రంగా గాయపర్చారని, తరువాత ఆయన చనిపోయ్యాడని రాహుల్ తెలిపారు. రాష్ట్రంలో టిఎంసి గూండాగిరి సాగుతోంది.
దేశంలో కొనసాగుతూ వస్తోన్న అహింసాత్మక సంవిధానానాకి ఇటువంటి ఘటనలు మచ్చ తీసుకువస్తాయని రాహుల్ తెలిపారు. అసనోల్ నార్త్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గా ఉన్న ప్రసేన్ జిత్ పుయితనిధికి అత్యంత నన్నిహితుడు అయిన కార్యకర్త ఛటర్జీ హత్య పై కాంగ్రెస్ నేత తీవ్రస్థాయిలో స్పందించారు బెంగాల్‌లో ఇప్పుడు ప్రజాస్వామ్యం లేదని, ఇక్కడ టిఎంసి భయోత్పాతక రాజ్యం సాగుతోందని తెలిపారు. తమ పార్టీ కాంగ్రెస్ ఎప్పుడూ హింసాత్మక చర్యలకు దిగలేదు. ఇకపై కూడా దిగబోదని స్పష్టం చేశారు. కార్యకర్తలంటే పార్టీలో ప్రాణంతో సమానం అని తెలిపారు.








