నూతలపాటి పేరరాజుగారనే గురువుగారు తన శిష్యులను విహారయాత్రకు తీసుకువెళ్ళి ప్రకృతి సౌందర్యాన్ని, మానవ ప్రవృత్తిని కలిపి వర్ణించమన్నారు. ఒక విద్యార్థి ‘సాంధ్యలలనాలలామంబుసంతసమున..’ అని ఆశువుగా చెప్పేశాడు. వెంటనే గురువుగారు ‘పారిజాతాపహరణ’ కావ్యం గూర్చి పద్యం చెప్పమని పరీక్ష పెట్టారు. వెనువెంటనే ఆ విద్యార్ధి పలుకు పలుకున తేనియలొలుకునట్లు.. అలా అలా అనర్గళంగా, లయబద్దం గా చెప్పుకొనిపోవటం గమనించిన గురువుగారు ఆ విద్యార్థిని ఆశీర్వదించారు. తరువాత కాలంలో ఆ బాలమేధా వి తెలుగు విశ్వవిద్యాలయపు తొలి ఉపకులపతి గా నియమితులయినా రు. ఆయనే ఆచార్య తూ మాటి దోణప్ప.

ఆచార్య తూమాటి దోణప్పగారు 1 జులై 1926, అనంతపురం జిల్లా, ఉరవకొండ తాలూకా, రాకె ట్ల గ్రామంలో జన్మించారు. తల్లి తిమ్మక్క, తండ్రి సంజీవప్ప. ప్రాథమిక విద్య ఉరవకొండ బోర్డు హై స్కూల్‌లోనే జరిగినది. అక్కడ ఉపాధ్యాయులు నూతలపాటిపేరరాజు. దోణప్పగారి చిన్ననాటి విద్యాభ్యాసం సొల్లాపురంలోని తాతగారైన భీమప్పగారి వద్ద జరిగినది. ఆయన గొప్ప పౌరాణికు లు. సంస్కృతాంధ్రలలో విద్వాంసులు. అమరం, శబ్ధాలు, మేఘసందేశం, రఘువంశం, యోగవాశిష్ట్యం, వివేకా చూడామణి వంటివి దోణప్పగారు వారి వద్దనే నేర్చుకున్నారు. భాగవత, భారత, రామాయణాల పట్ల అభిరుచి పెంచుకొని, ప్రవచ నం కూడా చేసేవారు. వజ్రకరూర్‌లో మేనమామ బొబ్బూరి చిన్న తిమ్మప్పగారి ఇంట్లో ఉంటూ ఆంగ్లం అభ్యసించారు. 1953లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి బి.ఏ. పట్టా పొందారు.

1954 లో ఎం. ఏ. పూర్తి చేశారు. 1965 లో పి. హెచ్.డి, 1982లో డి.లిట్.లను అందుకున్నారు. రెండున్నర దశాబ్దాలకుపైగా ఆంధ్రా, నాగార్జున విశ్వవిద్యాలయాలలో రిజిస్ట్రారుగా పనిచేశారు. అంతర్జాతీయ తెలుగు సంస్థ డైరక్టర్ పదవిని సమర్ధవంతంగా నిర్వహించారు. 1969 లో ‘ఆంధ్ర సంస్థానములు -సాహిత్య సేవ’ అనే వీరి గ్రంథానికి సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. వీరి మరో విశిష్ట రచన ‘తెలుగు హరికథా సర్వస్వం’ 1975-76 ఉత్తమ పరిశోధనా గ్రంథం గా సాహిత్య అకాడమీ అవార్డునందుకుంది. వీరు మొత్తం పదమూడు గ్రంథాలు రచించారు. మంచి నటులు, రచయిత, బహుభాషావేత్త. 1980 ఆం ధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు.

ఆచార్య తూమాటి దోణప్పగారికి తెలుగు వ్యాకరణము, భాషా శాస్త్రము, శాసన పరిశోధనలు అభిమాన అంశములు. ‘తెలుగుపదం వినిపిస్తే , అక్షరాలకు పరిమళం ఉన్నట్లుంటుంది’ అనేవారాయన. ఆయన రచనలో భావవ్యక్తీకరణ,భాష పరిరక్షణకు సంబంధించి ఓ సామాజిక బాధ్యత దృశ్యమానమవుతుంది. ఆయన భాషలో పాండి త్యం ఉంటుంది. కాని అది కృతకంగా అనిపించకపోవటం ఆయన రచనాశైలి చమత్కారం. భా ష పాఠకుడిని తనలోకి ఆహ్వానిస్తుంది. ఇదే ఆయన రచన వైశిష్ట్యం. ఆయ న భాషను కేవలం పాండిత్య దృష్టితో కాకుం డా ప్రజల జీవనంతో అ నుసంధానం చేశారనిపిస్తుంది. పల్లెపదాల అమాయకత్వం నుంచి, శాస్త్రీయమైన వ్యాకరణ గాం భీర్యం, జానపదగేయ సహజత్వం, సౌకుమా ర్యం ఇలా ఎన్నో పార్శ్వా లు దోణప్పగారి రచనల్లో స్పష్టమవుతాయి. తెలుగు వారిని మైమరిపిస్తాయి.

‘భాష నిలిస్తే సంస్కృతి నిలుస్తుంది, సంస్కృతి నిలిస్తే జాతి ని లుస్తుందనేది’ ఆయన వ్యాఖ్యానం. భాష గతం కా దు. భవిష్యత్ కూడానని ఆయన రచనల యొక్క ప్రగాఢ భావ ప్రకటనగా తెలుసుకోవచ్చు. ఆయన శైలి సరళంగా, స్పష్టంగా ఉం టుంది. ప్రకృతి, పల్లె జీవనం, మాతృభాష, జానపద సంస్కృతి వంటి అంశాలను ఆయన రచనల్లో ఒక చేయి తిరిగిన చిత్రకారుడు కుంచెతో చిత్రించి న అందమైన చిత్రం’లా ఆవిష్కరిస్తారు. భావ వ్యక్తీకరణలో భాషకు ఆయనిచ్చినఆత్మీయతాభావం శ్లాఘనీయం. భాష ఇచ్చే భరోసా, సాంత్వన, మా నసిక విశ్రాంతిని ఆయన చిన్న చిన్న ఏకాంకికలు, కృతులతో స్పష్టం చేశారు. తెలుగు మాటల్లో మట్టి వాసన, మానవత్వం, మాతృత్వ భావనలను సృ ష్టించిన ఆచార్య తూమాటి దోణప్ప తెలుగువారికి లభించిన గొప్పవరం.

తూమాటి దోణప్పగారు కేవలం రచయిత మాత్ర మే కాదు. తెలుగు భాషను జీవన తత్వంగా దర్శించిన సాహిత్యవేత్త. ఆయన రచనల్లో తెలుగు భాష ఒక జీవరూపం దాల్చుతుంది. ఒక మాతృత్వానుభూతిగా, ఒక సంస్కృతి స్వరూపంగా, ఒక జాతి ఆత్మగా ప్రత్యక్షమవుతుం ది. ఆచార్య తూమాటి దోణప్పగారు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఉన్న సమయంలో తిరుమల రామచంద్రగారు ‘మణినా వలయం, వలయేనమణిః మణినా వలయేనవిభాతికరః అన్నట్లు వైస్ ఛాన్సలర్ పదవితో దోణప్ప, దోణప్ప వల్ల వైస్ ఛాన్సలర్ పదవి ఈ రెండింటితో తెలుగు విశ్వవిద్యాలయం శోభిస్తున్నవని’ ప్రశంసించారు. దోణప్పగారి రచనలు తెలుగు భాష ఔన్నత్యానికి చిరస్మరణీయ జ్ఞాపకాలు. తెలుగు భాషకు అక్షరార్చనలు’గా చెప్పుకోవటం అతిశయోక్తి కాదు.

- భమిడిపాటి గౌరీశంకర్