బిజెపి అంటే భారతీయ జనతా పార్టీ కాదు బ్రిటీష్ జాహిల్ పార్టీ అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఢిల్లీలో నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీని నిరసిస్తూ ఆందోళన చేస్తున్న విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు ప్రపం చం ముందు సిగ్గుతో తలదించుకునేలా ఉందన్నారు. బుధవారం ఈమేరకు వీడియో సందేశం విడుదల చేశారు. పరీక్షలు ఫెయిర్‌గా నిర్వహించా లని నిరసన తెలిపితే సిసి కెమెరాలు ఆపేసి, ఇంటర్ నెట్ షట్ డౌన్ చేసి విద్యార్థుల వీపులపై లాఠీలు ఝళిపించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం మనపై ఏ విధంగా దాష్టీకాలకు పాల్పడిందో ఇప్పుడు బిజెపి కూడా సొంత ప్రజలపై అదే విధంగా దాష్టీకాలు చేస్తుంద న్నారు. విద్యార్థులపై పాశవికంగా చేసిన దాడికి బిజెపి ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నీట్ ఎగ్జామ్ నిర్వహించడం చేతకాని కేంద్రం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జులుం ప్రదర్శించడం ఏమిటని ప్రశ్నించారు. నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీ కారణంగా 25 లక్షల మంది విద్యార్థులు నష్టపోయారని,

21 మంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను కేంద్రం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై పోలీసుల దాడిని చూసి దేశం మొత్తం నిశ్చేష్టులయ్యారన్నారు. పేపర్ లీకేజీ ఘటనలకు బాధ్యత ఎవరిది? విద్యార్థుల చావులకు ఎవరు సమాధానం చెబుతారని ప్రశ్నించారు. స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి సంస్థల్లో పనిచే స్తున్న లక్షలాది గిగ్ వర్కర్లు, డ్రైవర్లు రోజంతా కష్టపడినా వారి ఆదాయం కుటుంబ పోషణకు కూడా సరిపోవడం లేదని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. అగ్రిగేటర్ సంస్థలు వారికి సరిపడ ఆదాయం ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నాయని చెప్పారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం వెంటనే జో క్యం చేసుకోవాలన్నారు. అగ్రిగేటర్స్ సంస్థలతో మాట్లాడి గిగ్ వర్కర్లకు, క్యాబ్ డ్రైవర్లకు ఛార్జీలు పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ఎప్పుడైనా పేదల పక్షం ఉండాలని కోరారు. గిగ్ వర్కర్లు, డ్రైవర్లకు తెలంగాణ రక్షణ సేన అండగా ఉంటుందన్నారు.