
ఇస్లామాబాద్: పాకిస్థాన్ రాష్ట్రం క్వెట్టాలో బొగ్గు గనిలో పేలుడు చోటుచేసుకుంది. సోరేంజ్‌లోని బొగ్గు గనిలో పేలుడు జరగడంతో 32 మంది మృతి చెందారు. బొగు గనిలో పది మంది చిక్కుకున్నారని స్థానిక మీడియా వెల్లడించింది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గనిలో మీథేన్ వాయువు భారీగా పేరుకుపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగినప్పుడు గనిలో42 మంది కార్మికులు ఉన్నట్టు సమాచారం. గనులలో భద్రతా చర్యలు లేకపోవడంతోనే ఈ ప్రమాదాలు జరుగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.








