
ఢిల్లీ: జీవితంలో కొన్ని తేదీలను గుర్తించుకోవడానికి క్యాలెండర్ అవసరం లేదని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. కార్గిల్ విజయ్ దివస్..ఈ రోజు మనల్ని గర్వంతో నింపుతుందని అన్నారు. కార్గిల్ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. మోడీ 136వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించారు. వీర సైనికుల అసాధారణ ధైర్యాన్ని మనకు గుర్తు చేస్తోందని, మాతృభూమిని రక్షించడానికి సైనికులు సర్వస్వం త్యాగం చేశారని కొనియాడారు. ఈ ఏడాది ఒక ప్రత్యేక ‘శౌర్య విజయ్ యాత్ర’ ను, ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ నుంచి బైక్ యాత్ర నిర్వహించారని అన్నారు. బైక్ యాత్ర కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నానికి చేరుకుంటుందని, బైకు యాత్ర సందేశం ‘ఒక ప్రమాణం, ఒక దేశం, ఒక సెట్యూట్ చేశారు. దేశం కోసం చేసిన త్యాగాలను ఎప్పటికీ మరువలేమని యాత్ర గుర్తుచేస్తుందని మోడీ పేర్కొన్నారు.
కొద్ది రోజుల క్రితం ‘ఐఎన్ఎస్ మహేంద్రగిరి’ నావికాదళంలో చేరిందని, ఆధునిక యుద్ధ నౌకను దేశంలోనే రూపకల్పన చేసి నిర్మించారని మోడీ ప్రశంసించారు. యుద్ధ నౌకలో 75 శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానాన్ని ఉపయోగించారని, ‘ఆత్మ నిర్భర్ భారత్’ శక్తికి ప్రతీక అని డిఆర్ వో ‘పినాక లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్’ ను విజయవంతంగా పరీక్షించిందని, రెండ్రోజుల క్రితం డిఆర్ డివొ ‘కుషా’ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిందని, భారత్ నిరంతరం కొత్త శిఖరాలను తాకుతోందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇండోనేషియాతో బ్రహ్మోస్ క్షిపణుల కోసం భారీ ఒప్పందం కుదిరిందని, భారత్ రక్షణ పరికరాలు, సాంకేతికతపై ప్రపంచానికి విశ్వాసం పెరుగుతోందని మోడీ స్పష్టం చేశారు.











