నవతెలంగాణ-కుభీర్ మండల కేంద్రమైన కుభీర్ తో పాటు ఫార్డి (బి) పల్సి, సోనారి, గోడపూర్ తదితర గ్రామాల్లో సోమవారం నాగ పంచమి వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఇందులో భాగంగా మహిళలు నాగ దేవత విగ్రహలకు ప్రత్యేక పూజలు చేసి, పక్కన ఉన్న పుట్టలో పాలు పోశారు. ఆర్థికంగా, ఆరోగ్యంగా అందరూ బాగుండాలని నాగదేవతను వేడుకున్నారు. దింతో అక్కడి నుంచి ఇంటికి వచ్చి అన్నదమ్ములకు కళ్ళు కడిగి స్వీట్ లు తినిపించారు.
The post భక్తిశ్రద్ధలతో నాగపంచమి వేడుకలు appeared first on Navatelangana.












