అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం గరిసింగి గ్రామంలో సోమవారం భారీ గిరినాగు ప్రజలను హడలెత్తించింది. రెండు ఇళ్ల గోడల సందులో సుమార్ 13 అడుగుల గిరినాగు చేరింది. దీనిని గమనించిన స్థానికులు చోడవరం అటవీ అధికారులకు సమాచారం అందించారు. వారి ద్వారా తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సమితి సభ్యులకు సమాచారం అందింది. సమితి సభ్యులు అక్కడకు చేరుకుని గిరినాగును పట్టుకున్నారు. అనంతరం చీడికాడ సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.