నార్కట్ పల్లి: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు గుట్ట కింద ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామివారి గుట్ట కింద బొమ్మల దుకాణంలో మంటలు అంటుకోవడంతో అగ్నికీలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. ఈ అగ్ని ప్రమాదంలో 17 దుకాణాలు, 15 తోపుడు బండ్లు బూడిదగా మారాయి. రెండు గ్యాస్ సిలిండర్లు కూడా పేలినట్టు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. గ్రామ పంచాయతీ కార్యాలయానికి మంటలు వ్యాపించడంతో పలు దస్త్రాలు కాలిపోయాయి. గ్రామస్థుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. రూ.2.5 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. అర్ధరాత్రి ప్రమాదం జరగడంతో దుకాణాలలో ఎవరు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.