
గాంధీనగర్: గుజరాత్‌లో చండీపురా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఈ వైరస్ బారిన పడి 22 మంది చిన్నారులు మృతి చెందారు. ఏడుగురు ప్రస్తుతం ఐసియులో చికిత్స పొందుతున్నారు. మరో 35 మందికి వైరస్ నిర్ధారణ కావడంతో చికిత్స అందిస్తున్నారు. గాంధీనగర్, హిమ్మత్‌నగర్, పటాన్, రాజ్‌కోట్, భావ్‌నగర్ లలోని ప్రభుత్వాస్పత్రులలో చికిత్స అందిస్తున్నారు. 184 అనుమానిత కేసులు నమోదు కావడంతో చికిత్స అందిస్తున్నారు. శాండ్ ఫ్లై అనే ఈగ ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తున్నట్టు వైద్యాధికారులు గుర్తించారు. గ్రామాల్లో క్రిమిసంహారక మందులు పిచికారి చేస్తున్నారు. ఈ వ్యాధి లక్షణాలు ప్రారంభంలో ఆకస్మికంగా జ్వరం రావడంతో పాటు తీవ్రమైన తలనొప్పి, వాంతులు ఉంటాయి. వ్యాధి తీవ్రత ముదిరితే వణుకు, మూర్ఛ, మానసిక స్థితిలో మార్పులతో పాటు కోమాలోకి వెళ్లిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 24 గంటల దాటితే తీవ్రమైన నాడీ సంబంధిత నష్టం జరగడంతో పాటు మరణానికి దారితీయవచ్చు.











