రాంచీ: జార్ఖండ్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్స్ అవకతవకలపై తొమ్మిది రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న జార్ఖండ్ లోక్‌తాంత్రిక్ మోర్చా (జేఎల్‌కేఎం) నేత దేవేంద్ర నాథ్ మహతో నేత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను రాంచీ సదర్ ఆసుపత్రికి తరలించారు. తమ డిమాండ్ల సాధన కోసం విద్యార్థులు సోమవారంనాడు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో అంబులెన్స్ ో్ల వచ్చి మహతో పాల్గొన్నారు. అనంతరం ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

మహతో ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయని, ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నామని సదర్ ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ నాన్సీ ప్రియ తెలిపారు. అయితే అసెంబ్లీ భవన్ సమీపంలో జరిగిన పోలీసు లాఠీఛార్జీలోనే మహతో గాయపడినట్టు ఆయన సన్నిహితుడు పంకజ్ కుమార్ తెలిపారు. అసెంబ్లీ సమీపంలో విద్యార్థులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జి చేసి, టియర్ గ్యాస్, వాటర్ కేనన్లు ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో పలువురు విద్యార్థులతో పాటు నలుగురు పోలీసుల సిబ్బంది గాయపడినట్టు అధికారులు తెలిపారు.