రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 14వ తేదీన ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్నారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరుగనున్న మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పాలనాపరమైన కీలక నిర్ణయాలపై కేబినెట్ భేటీలో చర్చించనున్నట్లు తెలిసింది.