
వారణాశి: డ్రగ్స్ సమస్యను అందరం కలిసి ఐక్యంగా ఎదుర్కొందామని ప్రధాని నరేంద్ర మోడీ యువతకు సూచించారు. జాతీయ ఉద్యమంలో అందరం భాగమవుదామని అన్నారు. నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమంలో మోడీ ప్రారంభించారు. డ్రగ్స్ నిర్మూలనపై 100 వారాల ఉద్యమానికి మోడీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాఠశాలలు, కళాశాలలు, వర్సిటీల్లో యువతకు అవగాహన కల్పించాలని యువతకు కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని అన్నారు. డగ్స్ కు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారని, డ్రగ్స్ మహమ్మారి నుంచి యువతను కాపాడాలని, విద్యాసంస్థల్లో ర్యాలీలు చేపట్టాలని, డ్రగ్స్ తాత్కాలికంగా ఆనందాన్ని ఇస్తాయని, కానీ భవిష్యత్తును పూర్తిగా నాశనం చేస్తాయని యువతకు సూచించారు. ప్రతి ఆదివారం క్రీడలు, ధ్యానం, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారని మోడీ పేర్కొన్నారు.











