రంగారెడ్డి: జీవనోపాధి నిమిత్తం సంవత్సరం క్రితం దుబాయ్‌కు వెళ్లిన పాతబస్తీ యువతి కనిపింకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. హైదరాబాద్‌లోని పాతబస్తీకి చెందిన యువతి తండ్రి చనిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. సదరు యువతి వైద్య విధ్య అభ్యసించడంతో ఆస్పత్రిలో విధుల నిమిత్తం దుబాయ్‌కు గత సంవత్సరం వెళ్లింది. గత నాలుగు ఐదు నెలల నుంచి ఆమె రెండు ఫోన్లు పనిచేయకపోవడంతో దుబాయ్ ఉన్న ఆమె స్నేహితులను విచారించిన ఆమె ఆచూకీ దొరకలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆర్‌జిఐఎకు ఫిర్యాదు చేశారు. దుబాయ్‌లో ఉన్న భారత ఎంబసీకి వివరాలు తెలియజేస్తామని అధికారులు తెలిపారు.