
సంగీత దర్శకుడిగా ఎన్నో మరపురాని ఆల్బమ్స్ అందించిన దేవి శ్రీ ప్రసాద్ నేడు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన హీరోగా పరిచయం అవుతున్న ‘ఎల్లమ్మ’ మూవీ టీం సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమా నుంచి దేవి ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో ఆయన చేతిలో కిరీటం పట్టుకొని రెట్రో లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన పాత్ర పేరు ‘పర్షి’ అని చిత్ర యూనిట్ తెలిపింది.
‘‘ఎల్లమ్మ’.. నుంచి పర్షిని పరిచయం చేస్తున్నాం. మట్టి నుంచి పుట్టిన ఈ పాత్రను మీరెప్పటికీ గుర్తుంచుకుంటారు. ఈ ప్రయాణాన్ని కూడా మీరెప్పటికీ మర్చిపోలేరు. ఆయన సంగీతాన్ని మనం సెలబ్రేట్ చేసుకున్నాం. దాంతో పాటు, ఈసారి వెండితెరపై ఆయన నటనను కూడా వేడుకగా జరుపుకొందాం. రాక్‌స్టార్ డిఎస్‌పికి పుట్టినరోజు శుభాకాంక్షలు. రాబోయే అద్భుతాను ఈ ప్రపంచం అస్సలు ఊహించలేదు’’ అని ఎల్లమ్మ టీం పేర్కొంది.
‘బలగం’ వంటి గ్రాండ్ సక్సెస్ తర్వాత వేణు యెల్దండి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది కావడంతో దీనిపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాలో దేవీ డప్పు కళాకారుడిగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ అంచనాలను పెంచేసింది. వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
#Yellamma... and in it a man called PARSHI ❤️🔥
— Sri Venkateswara Creations (@SVC_official) August 2, 2026
Presenting the ACTOR @ThisIsDSP in a role rooted in the soil with a name you will remember and a journey you will never forget 🔥
We always celebrate his music... Along with that, let's celebrate him on the silver screen too 😍… pic.twitter.com/zLsdRarC5G











