అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అర్థరాత్రి తణుకు- కొమరవరం మార్గంలో బైకుపై తల్లి, కూతురు వెళ్తుండగా బైకు అదుపుతప్పి కిందపడి బాలిక మృతి చెందింది. ప్రమాదంలో ఉన్న తల్లిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ తల్లి మరణంచింది. సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు నిడమరు మండలం బువ్వనపల్లికి చెందిన కల్యాణి( 24), కీర్తన(4) గా పోలీసులు గుర్తించారు.