
హైదరాబాద్: ‘తొలివలపు’ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత విలన్‌గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత హీరోగా మారి ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసిన నటుడు గోపిచంద్. విలక్షణమైన సినిమాలు చేయడంతో ఆయన ఎప్పుడు ముందుంటారు. అయితే గత రెండేళ్లలో గోపిచంద్ సినిమాలు రాలేదు. 2024లో ఆయన ‘విశ్వం’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఊహించినంత సక్సెస్ సాధించలేకపోయింది. ప్రస్తుతం గోపిచంద్ ‘భరతవర్ష’ అనే సినిమాలో నటిస్తున్నారు. తాజాగా గోపిచంద్ ఇండస్ట్రీకి వచ్చి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ‘భరతవర్ష’ టీమ్ ఓ ప్రత్యేక వీడియోని విడుదల చేసింది. ఇండస్ట్రీకి వచ్చి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు గోపిచంద్‌కు అభినందనలు తెలిపింది.
25 Years. Countless Memories. One Remarkable Journey. ❤️
— Srinivasaa Silver Screen (@SS_Screens) August 2, 2026
Congratulations to Our Dear @YoursGopichand garu on completing 25 glorious years in Telugu cinema. Your dedication and consistency continue to inspire, he's ready to redefine greatness with #BharataVarsha 🔥… pic.twitter.com/lbvtpOxJng











