హైదరాబాద్: నగరంలో డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టును ఈగల్ పోలీసులు చేధించారు. సైఫాబాద్‌ పిఎస్‌లలో రెండు కేసులు నమోదు చేసి.. కిలో ఓపియం, 25 గ్రాముల మెఫెడ్రీన్‌ను స్వాధీనం చేసుకున్నారు. రెండు కేసుల్లో మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశారు. దాదాపు రూ.12.65 లక్షల విలువైన డ్రగ్స్ పట్టుకున్నారు. రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు ప్రైవేటు బస్సులు, రైళ్లు, ప్రైవేటు వాహనాల్లో డ్రగ్స్ తరలిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. రాజస్థాన్‌కు చెందిన క్యారియర్లు, డెలివరీ ఏజెంట్లు, మధ్యవర్తులను గుర్తించారు.

ఈ ముఠా ఇప్పటివరకు 78 సార్లు డ్రగ్స్ తెప్పించిందని, రాజస్థాన్‌కు చెందిన మహేందర్ మావత్‌ను కీలక సరఫరాదారుగా గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. మియాపూర్ కేసులో మధురామ్, మహేంద్ర పటేల్, ధర్మేంద్రను అరెస్టు చేయగా.. సైఫాబాద్ కేసులో నలుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ నెట్‌వర్క్‌తో సంబంధం ఉండి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. మరోవైపు ఎండి డ్రగ్స్ తయారీ స్థావరాలను గుర్తించిన ఈగల్ ఫోర్స్ వాటిని ధ్వంసం చేసింది.