హీరో రోహిత్ నారా 23వ చిత్రం పూర్తి ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రాన్ని కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పి నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌తో చినిమిల్లి మణికుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భరత్ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా రూపొందిస్తున్నారు. రోహిత్ నారాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర నిర్మాతలు టైటిల్, ఫస్ట్-లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ’సౌండ్ ఇంజనీర్’ అనే ఆసక్తికర టైటిల్ పెట్టారు. ఫస్ట్-లుక్ పోస్టర్ రోహిత్ నారాను సరికొత్త అవతారంలో పరిచయం చేస్తుంది. టైటిల్ తో పాటు, కథానాయకుడి ప్రపంచాన్ని పరిచయం చేసే ఒక కాన్సెప్ట్ వీడియోను విడుదల చేశారు. హాస్యనటుడు సుదర్శన్ వాయిస్ తో ఈ వీడియో, రోహిత్ నారా పాత్రకు వినికిడి లోపం ఉందని తెలివిగా సూచిస్తూ, అతనికి ‘సౌండ్ ఇంజినీర్‘ అనే ట్యాగ్ తెచ్చిపెట్టింది. టైటిల్, కాన్సెప్ట్ వీడియో ప్రేమ, హాస్యం, భావోద్వేగాలు, సంగీతాన్ని మిళితం చేసే కథను సూచిస్తుంది. రోహిత్ నారా సరసన నయన్ సారిక కథానాయికగా నటిస్తోంది.