ప్రముఖ నటుడు సుమంత్ నటించిన చిత్రం ‘న్యూటన్స్ థర్డ్ లా’. రాజేశ్ కార్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని కె.హరీశ్ నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శనివారం చిత్ర ట్రైలర్‌ని ప్రముఖ హీరో అడవి శేష్ విడుద చేశారు. ఓ విభిన్నమైన మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందించారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా ట్రైలర్ చూపించిన కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.