కొండపాక: సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్టే గ్రామ పరిధిలోని 271 సర్వే నెంబర్ లో హరీష్ రావు కుటుంబానికి సంబంధించిన భూములను రెవెన్యూ అధికారులు సర్వే చేయనున్నారు. ఇందుకు సంబంధించి కలెక్టరేట్ లో భూ రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. క్షేత్రస్థాయిలో సర్వే కోసం రెవెన్యూ అధికారులు వెలికట్టకు వెళుతున్నారు. చిన్న కోడూరు మండలం చంద్రాపూర్ గ్రామ పరిధిలోని రంగనాయక సాగర్ వద్ద హరీష్ రావు వ్యవసాయ భూమిని అధికారులు పరిశీలిస్తున్నారు. ఆ ప్రాంతంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు  చేశారు. మరోవైపు సిద్దిపేటకు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు బయలుదేరారు. అసెంబ్లీ సీఎల్పీ పాయింట్ నుంచి బస్సులో సిద్దిపేటకు వెళ్లనున్నారు. సిద్దిపేట కలెక్టరేట్, స్థానిక రెవెన్యూ ఆఫీస్‌లో భూముల వివరాలను తెలంగాణ కాంగ్రెస్ నేతలు పరిశీలించనున్నారు.