
హైదరాబాద్: ఆప్ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సిఎం కేజ్రీవాల్ వంద మందితో ప్రధాని నరేంద్ర మోడీ నివాసానికి మార్చ్ చేపట్టారు. ఇ20 పెట్రోల్‌కు వ్యతిరేకంగా సేకరించిన రెండు లక్షలకు పైగా సంతకాలను సమర్పించేందుకు కేజ్రీవాల్ బయలుదేరారు. ఇథనాల్ పెట్రోల్‌ను కేంద్రమంత్రి గడ్కారీ కుమారులకు మేలు చేసేందుకు తీసుకొచ్చారని ఆరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. ఇథనాల్ పెట్రోల్ వాడడంతో వాహనాల మైలేజ్ తగ్గడంతో పాటు ఇంజన్ దెబ్బతింటుందని ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వం స్టడీ చేసిన రిపోర్టును విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి పెట్రోల్ బంకులో వినియోగదారుడి ఆప్షన్ ఉండాలని కోరారు. ప్యూర్ పెట్రోల్ కంటే ఇథనాల్ పెట్రోల్ ధర తక్కువగా ఉండాలని డిమాండ్ చేశారు. పెట్రోల్ ధరను రూ.84లకు చేర్చాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. అమెరికా నుండి ఇథనాల్ కొనుగోలు చేయడానికి ఆ దేశపు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు తలొగ్గారని మండిపడ్డారు.











