గ్లాస్గో: కామన్‌వెల్త్‌ గేమ్స్‌ 2026లో బాక్సింగ్‌లో భారత్ రెండు స్వర్ణ పతకాలు సాధించింది. తొలుత మహిళల 54 కెజిల విభాగంలో ప్రీతి పవార్ గోల్డ్ మెడల్ సాధించింది. ఫైనల్‌లో కెనడాకు చెందిన స్కార్లెట్ సవన్నా డెల్గాడోను ప్రీతి చిత్తు చేసింది. ప్రత్యర్థిపై పంచ్‌ల వర్షం కురిపించి ఏకగ్రీవంగా విజయం సాధించింది. అనంతరం మహిళల 57 కెజిల విభాగంలో భారత్‌కు మరో పసిడి పతకం దక్కింది. ఫైనల్‌లో నార్తర్న్ ఐర్లాండ్‌కు చెందిన మైఖేలా వాల్ష్‌పై జైస్మిన్ లాంబోరిమయా ఘన విజయం సాధించి స్వర్ణ పతకం సాధించింది. మరోవైపు పురుషుల ట్రిపుల్ జంప్‌లో ప్రవీణ్ చిత్రావెల్ (16.58 మీటర్లు) రజతం సొంతం చేసుకోగా.. సెల్వ ప్రభు తిరుమరన్ (16.52 మీటర్లు) కాంస్య పతకం సాధించాడు.