
గ్లాస్గో: కామన్‌వెల్త్ గేమ్స్ 2026లో భారత్‌కు రెండో పతకం లభించింది. పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 60 కేజీల విభాగంలో మణిపూర్ వెయిట్ లిఫ్టర్ రిషికాంత సింగ్ రజత పతకం సాధించాడు. మలేషియాకు చెందిన అనిక్ బిన్ కాస్డన్ 273 కేజీలు ఎత్తి స్వర్ణం సాధించగా.. జోషువా అముంగా (కెన్యా) 260 కేజీలు ఎత్తి కాంస్య పతకం నెగ్గాడు.
తొలుత స్నాచ్ విభాగంలో 121 కేజీలు ఎత్తిన రిషికాంత.. క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో చివరి ప్రయత్నంలో 151 కేజీలు ఎత్తే క్రమంలో విఫలమయ్యాడు. ఈ విభాగంలో మూడు ప్రయత్నాల్లో తొలుత 143 కేజీలు ఎత్తగా.. తర్వాతి రెండు రౌండ్లలో విఫలమయ్యాడు. దీంతో రిషికాంత మొత్తం 264 కేజీలు ఎత్తి ద్వితీయ స్థానంలో నిలిచాడు. ఈ కామన్‌వెల్త్ పోటీలో భారత్‌కు ఇది రెండో పతకం కాగా, తొలి రజతం ఇదే.











