కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం

48 కిలోల మహిళల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన మీరాబాయి చాను

పురుషుల విభాగంలో రిషికాంత సింగ్‌కు రజతం

రాష్ట్రపతి, ప్రధాని, సిఎం సహా పలువురు ప్రముఖుల అభినందనలు 

గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఖాతాలో తొలి స్వర్ణం వచ్చిచేరింది. మహిళల 48 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. కాగా, కామన్వెల్త్ గేమ్స్‌లో చానుకు ఇది వరుసగా మూడో గోల్డ్ మెడల్. అంతకుముందు 2018లో తొలి గోల్డ్ మెడల్ సాధించిన చాను.. 2022లో జరిగిన విశ్వక్రీడల్లో మరోసారి గోల్డ్ మెడల్ గెలుచుకుంది. దీంతో వరుసగా మూడుసార్లు కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన భారత వెయిట్ లిఫ్టర్‌గా చాను నయా రికార్డును నెలకొల్పింది.

అదివారం జరిగిన ఈ పోటీల్లో స్నాచ్ విభాగంలో తన తొలి ప్రయత్నంలో 82 కిలోల బరువు ఎత్తిన చాను.. రెండో ప్రయత్నంలో 82 కిలోల బరువును సునాయాసంగా ఎత్తి ంది. ఇక ఆఖరి ప్రయత్నంలో ఏకంగా 85 కేజీల బరువును ఎత్తి కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలోనే సరికొత్త స్నాచ్ రికార్డును నమోదు చేసింది. అనంరతం జరిగిన క్లీన్ అండ్ జెర్క్‌లోనూ అదే జోరు కనబరిచింది చాను. స్నాచ్ ముగిసే సమయానికే ప్రత్యర్థుల కంటే ఏకంగా 8 కేజీల ఆధిక్యంలో నిలిచిన మీరాబాయి, క్లీన్ అండ్ జెర్క్ విభాగంలోనూ తన ఆధిపత్యాన్ని చెలాయించింది.

క్లీన్ అండ్ జెర్క్‌లో మొదట 105 కిలోల బరువును ఎత్తింది. ఓవరాల్‌గా 190 కిలోల బరువును ఎత్తి సరికొత్త కామన్వెల్త్ గేమ్స్ కాంబినేషన్ రికార్డును నెలకొల్పింది. ఈ విభాగంలో నైజీరియాకు చెందిన రుత్ అసుక్వో 168 కిలోల బరువు ఎత్తి వెండి పతకం దక్కించుకోగా, మలేషియాకు చెందిన ఐరిన్ జేన్ హెన్రీ 167 కిలోల బరువు ఎత్తి కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. కాగా, ఈ పతకంతో భారత పతకాల సంఖ్య మూడుకు చేరింది.

చానబమ్‌కు రజతం..

భారత్‌కు చెందిన వెయిట్‌లిఫ్టర్ చానబమ్ రిషికాంత్ సింగ్ రజతం గెలుపొందాడు. ఆదివారం జరిగిన పురుషుల 60 కిలోల విభాగంలో అద్భుత ప్రదర్శనతో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో ఈ ఎడిషన్‌లో భారత్ పతకాల సంఖ్య రెండుకు చేరింది. అంతకు ముందు పారా-పవర్‌లిఫ్టర్ ఝండు కుమార్ ఇండియాకు తొలి కాంస్య పతకాన్ని సాధించిపెట్టిన విషయం తెలిసింది. మ్యాచ్ ప్రారంభంలో 28 ఏళ్ల రిషికాంత్ సింగ్ అద్భుతమైన ఫామ్‌ను కనబరిచాడు. స్నాచ్ విభాగంలో రిషికాంత్ తన మూడు ప్రయత్నాలను (116 కిలోలు, 119 కిలోలు, 121 కిలోలు) బరువులు ఎత్తి సక్సెస్ అయ్యాడు. మూడో ప్రయత్నంలో 121 కిలోల బరువు ఎత్తిన రిషికాంత్ వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో స్నాచ్ రికార్డును కూడా నెలకొల్పాడు. స్నాచ్ రౌండ్ ముగిసేసరికి అతను మలేషియాకు చెందిన బిన్ కస్దాన్ మొహమ్మద్ అనిక్‌తో కలిసి మొదటి స్థానంలో నిలిచాడు.

తృటిలో చేజారిన స్వర్ణం

క్లీన్ అండ్ జర్క్ రౌండ్‌లో మొదటి ప్రయత్నంలో 143 కిలోల బరువును సునయాసంగా ఎత్తిన రిషికాంత్ సింగ్.. రెండో ప్రయత్నంలో 148 కిలోలు ఎత్తడంలో విఫలమయ్యాడు. దీంతో అప్పటి వరకూ మూడో స్థానంలో కొనసాగుతున్న మలేషియన్ వెయిట్ లిఫ్టర్ అనిక్ 149 కిలోలను ఎత్తి ఆధిక్యంలోకి వచ్చాడు. స్వర్ణం గెలుచుకోవడానికి, రిషికాంత్ తన చివరి ప్రయత్నంలో 151 కిలోలను ఎత్తాల్సి ఉండగా విఫలమయ్యాడు. ఇక రిషికాంత్ మొత్తం 264 కేజీలు (స్నాచ్ 121 కిలోలు, క్లీన్ అండ్ జర్క్ 143 కిలోలు) ఎత్తి రజత పతకాన్ని గెలుచుకోగా.. మలేషియాకు చెందిన అనిక్ (273 కేజీలు) స్వర్ణం ఎగరేసుకుపోయాడు.