స్వర్ణాలు సాధించిన మహిళా బాక్సర్లు ప్రీతి పవార్, లంబోరియా, సాక్షి చౌదరి, ప్రియ గంగావ్, అరుంధతిలు

 పురుషుల విభాగంలో సచిన్ సివాచ్‌కు పసిడి పతకం

 షార్ట్‌పుట్‌లో సోమన్‌కు గోల్డ్ మెడల్

గ్లాస్గో: కామన్వెల్త్ క్రీడల్లో భారత మహిళా బాక్సర్లు సంచలనం సృష్టించారు. ఏకంగా ఐదు స్వర్ణ పతకాలు గెలుపొందిన తమ సత్తాను చాటుకున్నారు. మహిళల 54 కిలోల విభాగంలో ప్రీతి పవార్ గోల్డ్ మెడల్ సాధించగా.. 57 కిలోల మహిళ విభాగంలో జస్మినే లంబోరియా, 51 కిలోల మహిళల విభాగంలో సాక్షి చౌదరీ, 60 కిలోల విభాగంలో ప్రియా గంగావ్, 70 కిలోల విభాగంలో అరుంధతి చౌదరీ పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. 60 కిలోల పురుషుల విభాగంలో సచిన్ సివాచ్‌కు స్వర్ణం దక్కింది.

శనివారం జరిగిన ఫైనల్లో కెనడా చెందిన స్కార్లెట్ సవన్నా డెల్గాడోతో తలపడిన ప్రీతి తనదైన ఆటరుతో ప్రత్యర్థిని మట్టికపించింది. 54 కిలోల విభాగంలో ఓటమెరుగకుండా ఫైనల్లో అగుపెట్టిన ప్రీతి తిరుగుని పంచులతో చెలరేగింది. 50 తేడాతో విజయం సాధించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక 57 కిలోల విభాగంలో జస్మినే లంబోరియా అద్భుత ఆటతో విజేతగా నిలిచింది. ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన మైఖేల్ వాల్ష్‌కు ఏమాత్రం అవకాశమివ్వని భారత బాక్సర్ 5-0తో స్వర్ణం కైవసం చేసుకుంది.

వరల్డ్ ఛాంపియన్ అయిన జాస్మినే కామన్వెల్త్‌లో పసిడి తనకు తిరుగులేదని చాటింది. అనంతరం జరిగిన మరో పోరులో సాక్షి చౌదరీ అద్భుతమైన ప్రతిభా కనబరిచి ఇంగ్లండ్‌కు చెందిన బాక్సర్ రూబి వైట్‌ను 50 చిత్తుచేసి గోల్డ్ మెడల్ దక్కించుకుంది. కిలోల విభాగంలో ప్రియా గంగావ్ సయితం స్వర్ణం గెలుపొందింది. కెనడా బాక్సర్ మారీ అల్ ఆద్మియాను 41 తేడాతో ఓడించి పతకం కొల్లగొట్టింది. మహిళల 70కిలోల విభాగంలో ఇంగ్లండ్ బాక్సర్ చంటెల్లె రైడ్‌తో తలపడిన అరుంధతి 50 తేడాతో గెలుపొంది స్వర్ణం సొంతం చేసుకుంది. ఇక స్టార్ బాక్సరైన లొవ్లీనా బొర్గోహైన్ సెమీస్ దూసుకెళ్లింది. పురుషుల 55 కిలోల విభాగంలో భారత బాక్సర్ జడుమణి సింగ్ రజతం సాధించాడు.

షార్ట్‌పుట్‌లో పసిడి..

పారా షార్ట్‌పుట్‌లో సోమన్ రాణా పసిడితో మెరిసాడు. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో బలాన్నంత కూడదీసుకొన్ని 13.40 మీటర్ల దూరం విసిరాడు. దీంతో సోమన్ అగ్రస్థానంలోకి దూసుకెల్లాడు. ఇదే పోటీల్లో భారత్‌కు చెందిన శుభమ్ జుయల్ బంతిని 13.28 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. దీంతో జుయల్‌కు సిల్వర్ పతకం దక్కింది. ఈ కామన్వెల్త్ క్రీడల్లో పారా అథ్లెటిక్స్ విభాగంలో భారత్‌కు ఇది మూడో స్వర్ణ పతకం కావడం గమనార్హం. పురుషుల ట్రిపుల్ జంప్ ఈవెంట్‌లో భారత క్రీడాకారులు ప్రవీణ్ చిత్రవేల్ రజత పతకాన్ని, సెల్వ ప్రభు తిరుమరన్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ఆసియా గేమ్స్ బ్రాంజ్ మెడలిస్ట్ ప్రవీణ్ చిత్రవేల్ 16.58 మీటర్ల దూరం దూకి రజత పతకాన్ని కైవసం చేసుకోగా.. అతని తర్వాత మరో భారత ప్లేయర్ అయిన సెల్వ ప్రభు తిరుమరన్ 16.52 మీటర్ల దూరం దూకి కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. మహిళల జుడోకోలో భారత్‌కు చెందిర ఉన్నతి శర్మ బ్రోంజ్ మెడల్ సాధించింది.

నిరాశ పర్చిన నీరజ్.. రజతంతో సరి

కామన్వెల్త్ క్రీడల్లో భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తీవ్రంగా నిరాశపర్చాడు. స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగిన ఈ ఒలింపిక్ పతక విజేత.. ఈ పోటీల్లో రజతంతో సరిపెట్టాడు. శనివారం ఉదయం జరిగిన జావెలిన్ త్రోయర్ ఫైనల్లో నీరజ్ చోప్రా 85.83 మీటర్లు దూరం ఈటెను విసిరి రెండో స్థానంలో నిలవగా.. శ్రీలంకకు చెందిన రమేశ్ పతిరగే 89.75 మీటర్ల దూరం ఈటెను విసిరి స్వర్ణం పతకాన్ని ఎగరేసుకుపోయాడు. అయితే, భారత్‌కే చెందిన యశ్వీర్ సింగ్ 85.41 మీటర్ల దూరంతో మూడో స్థానంలో నిలిచాడు. కామన్వెల్త్ క్రీడల్లో నీరజ్ చోప్రాకు ఇది రెండో పతకం. 2018 గోల్డ్ కోస్ట్ క్రీడల్లో అతను స్వర్ణం గెలిచాడు. 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌కు గాయంతో దూరమయ్యాడు. కాగా, కామన్వెల్త్ క్రీడల్లో భారత పతకాల సంఖ్య 35కు చేరింది.