సిరోహి: రాజస్థాన్‌లోని సిరోహి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అబు రోడ్ జంక్షన్‌లో అతివేగంగా వెళ్తున్న బైక్ ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు గాల్లో ఎగిరి కారు బానెట్‌పై పడ్డారు. ఇద్దరిలో ఒక యువకుడు మొత్తం కారును దాటుకొని అవతల నేలపై పడ్డాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఆగస్టు 3న జరగ్గా.. తాజాగా సిసిటివి దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.