
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ’కొరియన్ కనకరాజు’తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్ కామెడీ సూపర్ నేచురల్ ఎలిమెంట్స్, నవ్వులు పంచే వినోదంతో గొప్ప థియేట్రికల్ అనుభూతిని అందించనుంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ’కొరియన్ కనకరాజు’ ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ సందర్భంగా హీరో వరుణ్ తేజ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “కొరియన్ కనకరాజు కథలో ఉన్న ఎంటర్‌టైన్‌మెంట్ నాకు చాలా నచ్చింది. గాంధీ ఈ కథ చెప్పినప్పటి నుంచి నేను నవ్వుతూనే ఉన్నాను. నేను ఏ కథ విన్నా, థియేటర్‌లో కూర్చొని సినిమా చూస్తున్న ప్రేక్షకుడిలాగే వింటాను. ప్రేక్షకులు రెండున్నర గంటల పాటు రిలాక్స్ అయి నవ్వుకునే సినిమా చేయాలనే ఉద్దేశంతో ’కొరియన్ కనకరాజు’ చేశాను. -ఈ సినిమాలో కామెడీతో పాటు యాక్షన్ కూడా చాలా బాగా కుదిరింది. ఇక టీజర్, ట్రైలర్ చూసి ప్రేక్షకులే సినిమా చూడాలని నిర్ణయించుకున్నారు. ఆ స్పందనే ఇప్పుడు బుకింగ్స్‌లో కనిపిస్తోంది. సత్యను కేవలం కమేడియన్‌గా మాత్రమే చూడకూడదు. తనలో మంచి నటుడు కూడా ఉన్నాడు. ఈ సినిమాలో మా ఇద్దరి పాత్రలు చాలా కీలకం. ప్రేక్షకులు ఈ రెండు పాత్రలతో కనెక్ట్ కావాలంటే మేమిద్దరం చాలా హోమ్‌వర్క్ చేశాం. రాయలసీమ యాస నేర్చుకుని, కామెడీ టైమింగ్‌పై ప్రత్యేకంగా వర్క్ చేశాం. ఆ కసరత్తు సినిమాలో బాగా వర్కవుట్ అయింది. మా ఇద్దరి కెమిస్ట్రీని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫిల్మ్. ఒక నటుడిగా ఇది నాకు చాలా ఛాలెంజింగ్ రోల్. రెండు విభిన్నమైన బాడీ లాంగ్వేజ్‌లు, రెండు భిన్నమైన మనస్తత్వాలు చూపించే అవకాశం రావడం చాలా సంతోషంగా అనిపించింది. నటుడిగా చాలా తృప్తినిచ్చింది. ’ఎఫ్2’, ’ఎఫ్3’ సినిమాలలో కామెడీ చేసినా, ఇందులో నా పాత్ర పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇందులో రెండు డైమెన్షన్స్ ఉన్నాయి. ప్రేక్షకులకు వరుణ్ తేజ్ కనిపించకూడదు... ’కనకరాజు’ మాత్రమే కనిపించాలి, నన్ను కనకరాజు పేరుతో పిలిచేంతగా ఆ పాత్రలో ట్రాన్స్‌ఫర్మ్ కావాలని ప్రయత్నం చేశాను. ఈ సినిమాకు మ్యూజిక్ చాలా కీలకం. పెనుగొండలో ఉండే ఒక మాస్ క్యారెక్టర్, కొరియన్ కల్చర్‌లోకి మారిన తర్వాత వచ్చే ట్రాన్స్‌ఫర్మేషన్ మొత్తం మ్యూజిక్‌లో వినిపించాలి. అదే తనకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పెద్ద ఛాలెంజ్ అని తమన్ చెప్పారు. ఆయన ఇచ్చిన రీ-రికార్డింగ్ అద్భుతంగా వచ్చింది. థియేటర్‌లో సౌండ్ గొప్ప అనుభూతినిస్తుంది. హీరోయిన్ -రితిక చాలా మంచి నటి. సినిమాలోని ఈ పాత్ర తనకు చాలా బాగా సరిపోయింది. -’కొరియన్ కనకరాజు’ నాన్‌స్టాప్ ఫన్ ఎంటర్‌టైనర్. కడుపుబ్బా నవ్వించే సినిమా. చాలా మంచి స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుంది. ప్రస్తుతం ’బరి’ సినిమా - ప్రీ -ప్రొడక్షన్ జరుగుతోంది. అది పూర్తిగా స్పోర్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ. నేను చిన్నప్పటి నుంచి వాలీబాల్ ఆడేవాడిని. అదే బ్యాక్‌డ్రాప్‌తో కథ వచ్చింది. ఇందులో నాన్నగారు కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు”అని అన్నారు.











