
హరారే: టీం ఇండియా టి-20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్రేయస్ అయ్యర్ తొలి విజయాన్ని అందుకున్నాడు. జింబాబ్వేతో జరిగిన తొలి టి-20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వైభవ్ సూర్యవంశీ అర్థశతకంతో రాణించగా బౌలింగ్‌లో కూడా భారత్ అద్భుతంగా రాణించింది. దీంతో కెప్టెన్‌గా శ్రేయస్ ఫుల్ ఖుషీ అయ్యాడు. మ్యాచ్ అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘‘దీని కంటే సంతోషకరమైన విషయం మరొకటి ఉండదు. మా కుర్రాళ్లు అద్భుతంగా రాణించారు. ప్రణాళికలను చక్కగా అమలు పరిచరాు. కెప్టెన్‌గా నా మొదటి విజయం అందుకోవడం ఎంతో సంతోషాన్నిస్తోంది. వైభవ్ సూర్యవంశీ నిర్భంగా ఆడాడు. అతడి ఇన్నింగ్స్ అసాధారణమైనది. గతంలో వైభవ్ ఇక్కడ ఆడాడు. ఇక్కడి పిచ్‌లపై అతడికి మంచి అవగాహన ఉంది. అండర్-19 ఫైనల్‌లో 175 పరుగులు సాధించిన అనుభవం ఉండటంతో మైదానంలోకి అడుగు పెట్టినప్పుడల్లా ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటాడు. ఈ మ్యాచ్‌లో అది స్పష్టంగా కనిపించింది. పునరాగమనం చేసిన మయాంక్ యాదవ్ అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు .సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు వేసి ప్రత్యర్థికి పరుగుల రాబట్టే అవకాశం ఇవ్వలేదు’’ అని శ్రేయస్ అన్నాడు.











