
కొలంబో: భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ ఐదో రోజున భోజన విరామం ఇచ్చారు. ఐదో రోజు 229/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక బ్యాటర్లు వికెట్లు కాపాడుకుంటూ బ్యాటింగ్ చేస్తున్నారు. సోనాల్ దినుష, కేశార నువంత కలిసి ప్రస్తుతానికి 111 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ క్రమంలో దినుష అర్థ శతకం సాధించగా.. నువంత హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. వీరిద్దరి భాగస్వామ్యాన్ని విడగొట్టేందుకు భారత బౌలర్లు తెగ కష్టపడుతున్నారు. లంచ్ బ్రేక్ సమయానికి శ్రీలంక 6 వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసి 116 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇలాగే కొనసాగితే ఈ టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశం ఉంది.











