
తిరువనంతపురం: పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కేరళంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. మూడింట రెండొంతుల మె జారిటీతో రాష్ట్రంలో ఎదురులేని విజయాన్ని సా ధించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన కీలక నేతలు కెసి వేణుగోపాల్, అసెంబ్లీలో విపక్ష నేత విడి సతీశన్, ఎంపి శశిథరూర్ సహా పలువురు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సంబురాలు చే సుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రి రేసులో ముగ్గురు కాంగ్రెస్ నేతలు పోటీలో ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, అసెంబ్లీలో విపక్ష నేత వీడీ సతీశన్, పార్టీ కేరళం విభాగం మా జీ అధ్యక్షుడు రమేష్ చెన్నితాల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రమేష్ చెన్నితాల సీనియర్ నా యకుడు,
అందరికన్నా అధిక రాజకీయ అనుభవం కలిగి ఉన్నారు. ఈ ముగ్గురూ నాయర్ సా మాజిక వర్గానికి చెందిన వారు కావడం విశేషం. కేరళ జనాభాలో సుమారు 12 శాతం మంది నాయర్ సామాజిక వర్గం వారుంటారు. ఇక ఈ ముగ్గురిలో రాహుల్ గాంధీకి కెసి వేణుగోపాల్ అత్యంత విశ్వాసపాత్రుడు. కాంగ్రెస్ జాతీయ ప్ర ధాన కార్యదర్శిగా గత ఏడేళ్లుగా పనిచేస్తూ గాంధీ కుటుంబానికి దగ్గరగా ఉన్నారు. కేంద్రంలో గతం లో మంత్రి పదవులు చేపట్టారు. ప్రస్తుతం లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. ఇక సతీశన్ విపక్ష నేతగా గత ఐదేళ్లుగా ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను గట్టిగా ఎదుర్కొన్నారు. అత్యంత సీనియర్ నేత ర మేష్ చెన్నితాల ముఖ్యమంత్రి అయ్యేందుకు ప్ర యత్నిస్తున్నారు. పాలనాపరమైన అనుభవంతో పాటు పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో సమర్థుడనే పేరుంది. యూడీఎఫ్ కూటమిలోని పార్టీలు కూడా ఆయనను బలంగా విశ్వసిస్తుంటాయి. తాజా ఎన్నికల్లో ఆ యన ప్రచార కమిటీకి సారథ్యం వహించారు.










