హైదరాబాద్: ఈ సంవత్సరం కుంభవర్షాలు కురుస్తాయని భవిష్యవాణి మాతంగి స్వర్ణలత తెలిపారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర చివర ఘట్టానికి చేరుకో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. వరదల్లో ప్రజలు కొట్టుకుపోయే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. ఈ ఏడాది తనని బాధపెడుతున్నారు, కంటతడి పెట్టిస్తున్నారని, తాను సంతోషంగా లేనని, కోపంతో వచ్చానని హెచ్చరించారు. భక్తులకు దోసెడంత ఇచ్చినా కూడా నాకు గోరంత కూడా ఇవ్వడం లేదన్నారు. తన విగ్రహ పత్రిష్ఠ చేస్తే కోరికలు నెరవేరుతాయని పేర్కొన్నారు.  ప్రజల్లో అహంకారం ఎక్కువవుతోందని, తగ్గించుకుంటే మంచిదని సూచించారు. వావి వరసలు లేకుండా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఆరు నెలల్లో విగ్రహ ప్రతిష్ట చేయకపోతే ప్రాణనష్టం తప్పదని స్వర్ణలత శాపం పెట్టారు.