
కూకట్‌పల్లి: స్కూటీని టిప్పర్ ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కూకట్‌పల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... మహేశ్(17), లక్ష్మీతేజ(17) అనే ఇద్దరు యువకులు మరో స్నేహితుడి కలిసి క్రికెట్ ఆడేందుకు స్కూటీపై వెళ్తున్నారు. టిప్పర్ లారీ అదుపుతప్పి వారిని ఢీకొట్టడంతో ఇద్దరు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. డ్రైవర్ వెంటనే ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. టిప్పర్‌ను సీజ్ చేశారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.











