
దాదాపు రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రితికా సింగ్ హీరోయిన్‌గా కనిపించనుంది. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్.. అంచనాలను పెంచేసింది. ఆగస్టు 7న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.
అయితే ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ డీల్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఒటిటి రైట్స్, శాటిలైట్ రైట్స్‌కు భారీ ధర దక్కినట్లు సమాచారం. ఈ మూవీకి నాన్ థియేట్రికల్ బిజినెస్ రూ.26 కోట్ల వరకు జరిగినట్లు తెలుస్తోంది. కాగా, ఈ చిత్రాన్ని కేవలం రూ.38 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించినట్లు సమాచారం. ఈ డీల్‌తో మూవీ రిలీజ్‌కు ముందే బిజినెస్ పరంగా కొరియన్ కనకరాజు దూసుకెళ్తున్నాడు. దీంతో ఇది వరుణ్ తేజ్ కమ్ బ్యాక్ సినిమాగా నిలుస్తుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.











