సమైరా, సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో అభినయ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న థ్రిల్లర్ ’కర్మాఖ్య’. మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ ప్రై.లి. బ్యానర్ పై వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. జూలై 31న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కానుంది. తాజాగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ వేడుకకు లేడి సూపర్ స్టార్ విజయశాంతి ముఖ్య అతిథి హాజరయ్యారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి మాట్లాడుతూ “మొదట ’కామాఖ్య’ అనే టైటిల్ చెప్పినప్పుడు చాలా పవర్‌ఫుల్‌గా అనిపించింది. కామాఖ్య అమ్మవారు పవర్ ఫుల్.

అయితే కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ’కర్మాఖ్య’ అని పెట్టారు. అందులో కూడా అమ్మవారి పేరు ఉంది. ‘కర్మాఖ్య’ ట్రైలర్ అద్భుతంగా ఉంది. సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది”అని అన్నారు. దర్శకుడు అభినయ కృష్ణ మాట్లాడుతూ “ఇది అమ్మవారి ఎలిమెంట్ ఉన్న క్రైమ్ థ్రిల్లర్. అందరూ ఈ సినిమా చూసి 100 శాతం థ్రిల్ అవుతారని నమ్ముతున్నాను. ఒక మలయాళం, హాలీవుడ్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది”అని తెలిపారు. నిర్మాత వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్ మాట్లాడుతూ “మా దర్శకుడు అభినయ కృష్ణ ఎంతో నిజాయితీగా, అంకితభావంతో ఈ సినిమాను తెరకెక్కించారు. తప్పకుండా ఆయనకు అవార్డు వస్తుందని నమ్ముతున్నాను”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మధు యాష్కీ, రవికుమార్ పనస, సమైరా, శరణ్య పాల్గొన్నారు.