కుత్బుల్లాపూర్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ లోని బౌరంపేటలోని బాలుర మైనారిటీ స్కూల్లో దారుణం వెలుగులోకి వచ్చింది. నాలుగు రోజుల క్రితం ఐదవ తరగతి విద్యార్థిపై ముగ్గురు విద్యార్థుల లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధిత బాలుడు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో దుండిగల్ పోలీసులకు అతడు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రభుత్వ మైనారిటీ స్కూల్ ప్రిన్సిపల్ ఈ  విషయాన్ని గొప్యంగా ఉంచినట్టు ఆరోపణలు వస్తున్నాయి. వార్డెన్ లు ఏం చేస్తున్నారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.