
(ఇటీవల హైదరాబాద్ వచ్చిన ప్రముఖ కవి,సాహితీ విమర్శకులు సచ్చిదానందన్‌తో రఘు శేష భట్టార్ చేసిన ఇంటర్వ్యూ )
మీరు భారతీయ కవుల్లో శిఖర సమానులు. పాఠకులే కాదు ఉద్దం డులైన ఎంతోమంది కవులు మీ కవిత్వానికి ఫిదా ఔతారు. ఇంత మందిని mesmarize చేసేలా రాయటం ఎలా సాధ్యమైంది? చిలీకి చెందిన సుప్రసిద్ధ కవి నికనర్ పర్రా అంటాడు. - కవి ఐన వాడు ఖాళీ పేజీలపై తనదైన ముద్ర వేయాలని. ఆ పేజీలను నేను కొత్తగా సున్నితంగా మలచాలనుకుంటాను. నిజానికి కవి ఐన ప్రతి మనిషి ఈ సూత్రాన్ని పాటించాలి. అప్పుడు మాత్రమే పాఠకుల కు దగ్గరౌతాం. బహుశా నేను నికనర్ పర్రా మాటల్ని గట్టిగా పట్టించుకొని ఉంటాను. ఒక అత్యుత్తమ కవికి ఉండే లక్షణం ఏమిటంటే అతడు ఎంతో మంది అజ్ఞాత పాఠకులకు స్ఫూర్తినిస్తాడు. తన రాతలతో వాళ్ళను ఉక్కిరి బిక్కిరి చేస్తాడు. ఎంతోమందిని తట్టిలేపిన మీరు అలా స్ఫూర్తి పొందిన సందర్భాలున్నాయా? నేనిప్పటికీ కవిత్వం చదువుతాను. గంగలో మునిగి అర్ఘ్యం ఇచ్చే వాడిలా లేదా మక్కా వైపు తిరిగి ప్రార్థించే వాడిలా శ్రద్ధగా చదువుతా ను, రాసేప్పుడు కూడా అలాగే ఉంటాను. అట్లా ఉండటమే సాహిత్య సాంప్రదాయం అనుకుంటాను. ప్రతీకలు, రూపకాలు నాకు వర్ణమాలలాంటివి. చదవటం నాకు స్ఫూర్తినిస్తుంది.
Loving a women, Because you do not love me తరహా కవితలు సాధారణ కవులెవరూ రాయలేరనిపిస్తుంది. స్త్రీ హృద యంతో ఆలోచిస్తేనే అది సాధ్యమౌతుంది. అటువంటి మానసిక స్థితికి మీరెట్లా చేరుతారు? కవిత అనేది బిగ్గరగా చెప్పేది కాదు, పొందికగా మనతో మనం మాట్లాడుకున్నట్టు చేసే క్రియ. ఇది అర్థం కానప్పుడు కవిత్వం ఉపన్యాసం లాగా వ్యాసంలాగా మారిపోతుంది. స్త్రీ సంబంధ కవిత్వం రాసినప్పుడు నాలో నేను గుసగుస పోతాను. వస్తువులోకి లీనమౌతాను. భిన్నంగా రూపాంతరం చెందుతాను. మీరు ఉదహరించిన కవితల్లో బహుశా అదే జరిగిందనిపిస్తుంది.
మిమ్మల్ని నిరంతరం కవిత్వం వైపు లాగే సాధనం ఏదైనా ఉందా? మీ దృష్టి స్థిరంగా ఉండేలా జాగ్రత్త పడతారా? కవిత్వం అనేది దానికదే ప్రత్యేక భాష. అది భావాల సంశ్లేషణ. శరీరానికి ఉన్నట్టే మాటకు కూడా ఇంద్రియ జ్ఞానం ఉందని నమ్ముతా ను. మాటను వింటున్నట్టే లోచూపుతో పట్టుకోవాలి. భావాల వాసన పసిగట్టాలి. దాని తాకిడిని అనుభవించాలి. ఇది రానప్పుడు కవిత్వం ఒట్టి మాటల కుప్ప. మళయాళంలో మీరింత వరకు 40 కి పైగా కవితా సంపుటాలు వేశారు. ఎన్నో అనువాదాలు చేశారు. మీ సమకాలికుల్లో మీ అంత విస్తృతంగా రాసిన వాళ్ళు లేరు. సాహిత్యానికి ఇంత కాంట్రిబ్యూ షన్ ఇచ్చాక మీకు కవిత్వం విసుగనిపించలేదా?
కాలాలతో సంబంధం లేకుండా అన్ని దేశాల భాషల్లోని కవులతో వా ళ్ళు నా సమకాలీకులనుకొని సంభాషించటం నాకు ఇష్టమైన వ్యాప కం. కవిత్వమే కవుల పరిభాష. నేను దానిని రక్తగతం చేసుకున్నాను. అందుకే మూడు వేల పేజీల అనువాదం చేయగలిగాను. Indian Universitiesలో కవిత్వ బోధన ఏ స్థాయిలోఉంది? వాటి ప్రమాణాలు ఇంకా మెరుగు పరిచేందుకు ఏం చేస్తే బాగుంటుంది ? ఔను. ఇది సరిగా జరగటం లేదనిపిస్తుంది. అక్కడి మేధోవర్గం పరంపరగా అలవాటైన పద్ధతుల్లో కవిత్వాన్ని విశ్లేషించటం దగ్గరే ఆగినట్టుంది. మారుతున్న కాలంతో కవిత్వాన్ని బోధించే పద్ధతి కూడా మా రాలి. దీని కోసం పాత text ఏమీ మార్చనక్కర్లేదు కానీ కొంచెం ఉత్తేజకరంగా ఉండేలా ప్రయత్నించటంలో తప్పేమీ లేదు. ఇది కొత్త తరా న్ని కవిత్వానికి దగ్గర చేస్తుంది. దీనిపై మరింత కృషి జరగాలి.
జాతీయ స్థాయిలో అనువాద అకాడమీ ఉంటే ప్రాంతీయ భాషల్లో చేసిన రచనలు మిగతా భాషల్లోకి వెళ్ళగలుగుతాయనిపిస్తుంది. మీరేమంటారు? నేను సాహిత్య అకాడమీలో పని చేస్తున్నప్పుడు దీని గురించి కొంత చర్చ జరిగింది. ప్రాంతీయ భాషల నుండి ఇతర భాషల్లోకి అనువాదాలు విస్తృత స్థాయిలో జరగాలని అశోక్ వాజ్ పేయి లాంటి వాళ్ళు కోరుకున్నారు. కానీ ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. వ్యక్తిగతంగా నేను ప్రాంతీయ భాషల నుండి మంచి రచనలు అనువాదం జరగాలని కోరుకుంటాను.











