
ఖమ్మం నగరం లోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక యు వకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కేవలం ఇం టి ముందు మూత్ర విసర్జన చేశాడనే చిన్న వివాదం ఒక యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. రంగ నాయకుల గుట్ట సమీపంలో ఇద్దరు యువకుల మ ధ్య జరిగిన ఘర్షణలో కత్తితో దాడి చేయడంతో దం డేటి శ్రీనాథ్ (24)అనే యువకుడు మృతి చెందా డు. పోలీసుల వివరాల ప్రకారం.. రంగనాయకుల గుట్టకు చెందిన దండేటి శ్రీనాథ్ ఫంక్షన్ డెకరేషన్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన మధు అనే యువకుడు వడ్డెర కూలిగా జీవనం సా గిస్తున్నాడు. వీరిద్దరూ అవివాహితులు. గురువారం అర్ధరాత్రి సమయంలో మధు తన ఇంటి బయట మూత్ర విసర్జన చేస్తుండగా, అప్పటికే తీవ్రంగా మ ద్యం మత్తులో ఉన్న శ్రీనాథ్ అక్కడికి వచ్చాడు. నా ఇంటి ముందే ఎందుకు మూత్రం పోస్తున్నావు? అంటూ మధుతో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాట మాట పెరిగి వివాదం తీవ్ర రూపం దాల్చిం ది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి లోనైన శ్రీనాథ్.. సమీపంలో ఉన్న ఒక సెంట్రింగ్ కర్రను తీసుకుని మధు తలపై బలంగా మోదాడు.
శ్రీనాథ్ కొట్టిన దె బ్బకు కోపంతో ఊగిపోయిన మధు.. వెంటనే తన ఇంట్లోకి వెళ్లి పదునైన కత్తిని తీసుకుని వచ్చి శ్రీనా థ్పై విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి నరికే శాడు. రక్తపు మడుగులో కుప్పకూలిన శ్రీనాథ్‌ను సమీపంలోని ఒక కాలువలో పడేసి నిందితుడు మ ధు అక్కడి నుండి పరారయ్యాడు. శుక్రవారం ఉద యం రంగనాయకుల గుట్ట సమీపంలోని కాలు వలో విగతజీవిగా పడి ఉన్న శ్రీనాథ్‌ను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమా చారం అందించారు. అనంతరం శ్రీనాథ్‌ను చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అతను అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సమాచారం అందుకున్న త్రీ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనా స్థలాన్ని క్లూస్ టీమ్ పరి శీలించింది. చిన్న గొడవ చివరకు హత్యకు దారితీ యడంతో స్థానిక ప్రాంతంలో తీవ్ర భయాం దోళన లు నెలకొన్నాయి. ఈ ఘటనపై త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు మధు కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.










