మెదక్: గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో చిరుత మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా రామాయంపేట్ మండలం తొనిగండ్ల గ్రామ శివారులో జరిగింది. రోడ్డు దాటుతుండగా చిరుతను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. వాహనదారుల సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకొని చిరుతను రామాంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంటర్నరీ వైద్యుడు పోస్టుమార్టం చేసిన అనంతరం చిరుత కళేబరానికి దహన సంస్కారాలు నిర్వహిస్తామని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు.