
నేడు, రేపు విచారణకు రావాలని ఆదేశాలు
న్యూఢిల్లీ : ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటాకు కేంద్ర ప్రభుత్వం సమన్ల మీద సమన్లు జారీ చేస్తోంది. మెటా గ్లోబల్ ఇండియా బృందానికి కేంద్ర ప్రభుత్వం మంగళవారం మనో సారి నోటీసులు జారీ చేసింది. సంస్థ పబ్లిక్ పాలసీ చీఫ్ జో కాప్లన్‌కు సమన్లు ఇచ్చింది. ఆయనతో పాటు ఇన్‌స్టాగ్రామ్ ప్రతినిధులకు కూడా నోటీసులు జారీ చేస్తూ ఆగస్టు 5, 6వ తేదీల్లో విచారణకు రావాలని వారిని ఆదేశించించింది. సిస్టమ్స్ అనుకున్న రీతిలోనే సమర్థవంతంగా పనిచేసేలా చూడాల్సిన బాధ్యత మెటాదేనని కేంద్ర ఐటి కార్యదర్శి ఎస్. కృష్ణన్ స్పష్టం చేశారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధికారిక ఖాతా పోస్ట్‌ను ఆటోమేటెడ్ సిస్టమ్స్ డిలీట్ చేయడంపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మెటా ఇండియా పాలసీ టీమ్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది. అమెరికాలోని గ్లోబల్ లీడర్‌షిప్‌ను నేరుగా ఢిల్లీకి రావాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సోషల్ మీడియా వేదికల్లో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు, కంటెంట్‌కు అత్యధిక ప్రాధాన్యత దక్కుతోందని, ఈ నేపథ్యంలో మెటా ఆల్గారిథమ్ ఏ పద్ధతిలో పనిచేస్తోందో తెలుసుకోవాలని ప్రభుత్వం భావిస్తునట్లు నోటీసులు పేర్కొన్నారు.











