కాస్త మోహం వుండాలి

బతుకు పట్ల లక్ష్యం పట్ల

నిరాశలను దూగోడ పట్టి

భవిశ్వత్తునుబాంగారు బొమ్మను చేయాలి

కాస్త ప్రేమ ఉండాలి

పచ్చదనం పట్ల ప్రకృతి పట్ల

దోసిలి నీల్లు చల్లి

చెట్టును చేమనుచేరదేయాలి

కాస్త జాలి వుండాలి

అలిసిన వారి పట్ల ఓడిన వారి పట్ల

స్వాస్థన కూర్చి మాటలు పేర్చి

విశ్వాసాన్ని మెదడు నిండా దట్టించాలి

కాస్త గౌరవం ఉండాలి

నదీ పట్ల సముద్రము పట్ల

సీసాలు ప్లాస్టక్ విసిరేయకుండా

నీటితో పవిత్రంగా ప్రార్థన చేయాలి.

కాస్త బాధ్యత వుండాలి

అమ్మ పట్ల నాన్న పట్ల

మూలాలకు సేవ చేసి సదా

మనుషులం అనిపించు కోవాలి

- దాసరి మోహన్