
మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్ థాక్రే ఇద్దరు సినీ నటులపై విరుచుకుపడ్డారు. బాలీవుడ్ నటులు వివేక్ ఒబెరాయ్, మాధవన్‌లపై విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ప్రశంసించే వారు విదేశాల్లో ఎందుకు నివసిస్తున్నారని ప్రశ్నించారు. ముంబైలో ఎంఎన్‌ఎస్ విద్యార్థి విభాగం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన రాజ్ ఠాక్రే... దేశంలో అన్నీ బాగున్నాయని, దేశాన్ని మోడీ అభివృద్ధి చేస్తున్నారని
చెబుతున్న వివేక్ ఒబెరాయ్, మాధవన్ తమ కుటుంబాలతో కలిసి దుబాయ్‌లో ఎందుకు ఉంటున్నారు? అని ప్రశ్నించారు. అయితే తన కుమారుడు వేదాంత్ ఈత శిక్షణ కోసం దుబాయ్‌కు వెళ్లినట్లు మాధవన్ వెల్లడించారు. భారత్‌లో టాక్స్‌లు చెల్లిస్తున్నానని, తన వృత్తిపరమైన అనుబంధం కూడా భారతదేశంతోనే కొనసాగుతోందన్నారు. వ్యాపార కార్యకలాపాల కోసమే దుబాయ్‌లో నివసిస్తున్నట్టు వివేక్ ఒబెరాయ్ గతంలో ప్రకటించారు.











