
కాళోజీ యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో
త్వరలో కౌన్సెలింగ్ నోటిఫికేషన్
మన తెలంగాణ/హైదరాబాద్: నీట్ యుజి 2026లో అర్హత సాధించిన తెలంగాణ వి ద్యార్థుల జాబితాను కాళోజీ నారాయణరా వు ఆరోగ్య విశ్వవిద్యాలయం (కెఎన్‌ఆర్‌యుహెచ్‌ఎస్) శనివారం విడుదల చేసింది. కటాఫ్ పర్సంటైల్, కటాఫ్ స్కోరుతో పాటు నీట్ పరీక్ష రాసిన విద్యార్థుల పేరు, కేటగిరీ, ర్యాంకు, నీట్ యుజి స్కోరు తదితర వివరాలతో ప్రత్యేక జాబితాను వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
ఈ జాబితాలో రాష్ట్రంలో అర్హత సాధించిన 38,021 మంది అభ్యర్థుల నీట్ రోల్ నెం బర్, ఆలిండియా ర్యాంకు, నీట్ స్కోర్ పొం దుపరిచారు. తాము విడుదల చేసిన ఈ జా బితా అభ్యర్థులు, తల్లిదండ్రులకు కేవలం స మాచారం కోసమే అని, దీనిని మెరిట్ జాబితాగా పరిగణించరాదని కాళోజీ వర్సిటీ స్ప ష్టం చేసింది. దరఖాస్తు చేసుకొనే ముందు వి ద్యార్థులు వర్సిటీ విడుదల చేసే నోటిఫికేష న్, ప్రాస్పెక్టస్‌ను జాగ్రత్తగా చదవాలని విజ్ఞ ప్తి చేసింది. త్వరలో కౌన్సెలింగ్ కోసం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
టాప్ ర్యాంకర్లలో అబ్బాయిల హవా
ఆలిండియా ర్యాంకుల్లో అర్హత సాధించిన రాష్ట్రాని కి చెందినవారిలో 1000 లోపు ర్యాంకులున్న అ భ్యర్థులు 40 మంది ఉన్నారు. వీరిలో అబ్బాయిలు 33 మంది ఉండగా, అమ్మాయిలు ఏడుగురు ఉ న్నారు. 100 లోపు ఆలిండియా ర్యాంకులు సా ధించిన విద్యార్థులు ముగ్గురు ఉన్నారు. 705 మా ర్కులతో వీరహగారి సాహు ఆలిండి యా 13వ ర్యాంకు సాధించగా, రాష్ట్రంలో ఒకటో స్థానంలో నిలిచారు. బూరసాయి చరణ్ 701 మార్కులతో అఖిల భారత స్థాయిలో 19వ ర్యాంకు సాధించి రాష్ట్రంలో రెండో స్థానంలో నిలువగా, కండగట్ల హ రీష్ 700 మార్కులతో అఖిల భారత స్థాయిలో 23వ ర్యాంకు సాధించి, మూడో స్థానం పొందారు.
అలాగే రాష్ట్రంలో నాలుగు నుంచి ఏడు వరకు అందెంసాయి చరణ్ 700 మార్కులతో ఆ లిండి యా 38వ ర్యాంకు, మయూక్ జయసింహ 700 మార్కులతో ఆలిండియా 42వ ర్యాంకు, కొంపె ల్లసాయి గాయత్రి తెజోరునిమా 693 మా ర్కుల తో ఆలిండియా 83వ ర్యాంకు, రుటుంబికా మో హంతి 691 మార్కులతో ఆలిండియా 91వ ర్యాం కు సాధించి రాష్ట్రంలో ఏడో స్థానంలో నిలిచారు.











