
న్యూఢిల్లీ: టిబెట్ ఎగువన కురిసిన భారీ వర్షాలకు ఉత్తర నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో బుధవారంనాడు ఒక్కసారిగా వరద పోటెత్తింది. టిబెట్ వైపు నుంచి ఉగ్రరూపంతో దూసుకొచ్చిన భోటెకోశీ నది సరిహద్దు గ్రామాలను ముంచెత్తింది. వరద తాకిడికి రసువా జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇళ్లు, వాహనాలు, వంతెనల కొట్టుకుపోయాయి. ఈ ప్రకృతి విపత్తులో 500 మందికి పైగా గల్లంతయినట్టు నేపాల్ టూరిజం బోర్డ్ (ఎన్‌టీబీ) వెల్లడించింది. వీరిలో 291 మంది విదేశీయులు ఉండగా.. అందులో 133 మంది భారతీయులు ఉన్నారు. మరో 37 మంది ప్రవాస భారతీయులు కూడా ఉన్నారు. గల్లంతయిన వారిలో 93 మంది నేపాల్ జాతీయులు ఉండగా, తక్కిన వారు యూఎస్‌ఏ, మలేసియా, యూకే, దక్షిణాఫ్రియా, నెథర్లాండ్స్‌జాతీయులు ఉన్నారని ఎన్‌టీబీ తెలిపింది. ఈ ఘటనలో కనీసం 95 మంది మృతి చెందిన ట్టు నిర్ధారణ కాగా, బురదలో నేక మంది కూరుకుపోయినట్టు అంచనా వేస్తున్నారు. కాగా, గల్లంతైన వారిలో కైలాస్ మానస్ సరోవర్ యాత్రకు వచ్చిన 59 మంది
భారతీయులు ఉన్నట్టు సామ్రాట్ టూర్స్ అండ్ ట్రావెల్ ఏజెన్సీ తెలిపింది. భోటెకోశీ నది బుధవారం ఉదయం ఉద్ధృతంగా ప్రవహించిందని, నదిలో ప్రవాహం అకస్మాత్తుగా పెరగడంలో రసువా జిల్లాలోని పలు గ్రామాలకు తీవ్ర నష్టం జరిగిందని నేపాల్ ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇళ్లు, ప్రాజెక్టు కేంద్రాలు దెబ్బతిన్నాయని పేర్కొంది. అనేక మంది ప్రాణాలు కోల్పోయారని, 41 మంది భద్రతా సిబ్బంది గల్లంతయ్యారని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. వరద ఉధ్ధృతి పెరుగుతుండటంతో నేపాల్ జాతీయ విపత్తు నిర్వహణా సంస్థ అప్రమత్తమైంది. భోటెకోశీ, త్రిశూలి నదీతీర ప్రాంతాలైన రసువా, సువాకోట్, దాడింగ్, చిత్వాన్, గోర్ఖా జిల్లాల ప్రజలను సురక్షిత ప్రారంతాలకు తరలించాలని ఆదేశిస్తూ హైఅలర్ట్ ప్రకటించింది. రంగంలోకి దిగిన నేపాల్ ఆర్మీ, సాయుధ పోలీసులు బలగాలు హెలికాప్టర్లు, అత్యవసర వైద్య బృందాలతో ముమ్మర సహాయలకు చర్యలు ప్రారంభించాయి.
ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు వచ్చిన వారి వివరాలు, భద్రతా స్టాటస్‌ను తెలుసుకునేందుకు నేపాల్ టూరిజయం బోర్డు, టూరిస్ట్ పోలీస్, టూరిజం సంస్థలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. మెరుపు వరదల్లో నువాకోట్, రసువ జిల్లాల్లోని 354 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 8 హైడ్రో పవర్ ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న మరో 5 ప్రాజెక్టులు దెబ్బతిన్నాయని నేపాల్‌లోని ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ తెలిపింది. నేపాల్ ఆర్మీ 12 హెలికాపర్లను సహాయక చర్యల కోసం రంగంలోకి దింపింది. త్రిశూలిలోని మిలటరీ ట్రైనింగ్ సెంటర్ నెంబర్ నెంబర్ 1లో ట్రీట్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేసింది. నేపాల్ ఆర్మీకి చెందిన వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచింది.
నేపాల్ ప్రధాని అత్యవసర సమావేశం
వరదల పరిస్థితి, సహాయక చర్చలను సమీక్షించేదుంకు నేపాల్ ప్రధానమంత్రి బాలెన్ షా అధ్యక్షతన అత్యవసర సమావేశం జరిగింది. నేపాల్ ఆర్మీ, ఆరమ్డ్ పోలీస్ ఫోర్స్, నేపాల్ పోలీస్ ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించారు.
సత్వర చర్యలకు ఆదేశించారు. కాగా, మెరుపు వరదలకు సంబంధించి ముందస్తు వార్నింగ్ ఇవ్వడంలో చైనా విఫలమైందని పలువురు నేపాల్‌వాసులు ఆరోపిస్తున్నారు.
ఇండియన్ ఎంబసీ ఎమర్జెన్సీ నెంబర్లు
మెరుపు వరదలతో ప్రభావితమైన భారత జాతీయులకు సహాయం, సమాచారం కోసం ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్లు జారీ చేసింది. +977 985 131 6807, +977 970 910 7500 నెంబర్లను సంప్రదింటాలని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పేర్కొంది. నేపాల్ టూరింజం హోర్టు సైతం ఇవే నెంబర్లు విడుదల చేసింది. వీటితో పాటు టోల్ ఫ్రీ నెంబర్ 1234, హాట్‌లైన్ 1144, టూరిస్ట్ పోలీస్ 9851289445ను సహాయం కోసం సంప్రందించాలని కోరింది.
బిహార్, ఉత్తరప్రదేశ్‌కు అడ్వైజరీలు
కాగా, నేపాల్ సరిహద్దుల్లో ఉన్న బిహార్, ఉత్తరప్రదేశ్‌కు భారత ప్రభుత్వం అడ్వైజరీలు జారీ చేసింది. గండక్ నదీ పరివాహక ప్రాంతాల్లోను ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితిని నిశితంగా పరిశీలించాలని అధికారులను కోరింది.











