తెలంగాణ నిరుద్యోగులకు మరో శుభవార్త అందింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) వరుసగా కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. తాజాగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో మొత్తం 222 పోస్టులు భర్తీ చేయనున్నారు. జూన్ నెలలోనే మరిన్ని నోటిఫికేషన్లు విడుదల చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. ప్రతి నెలా రెండు నుంచి మూడు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ఛైర్మన్ బుర్రా వెంకటేశం వెల్లడించారు. అలాగే అటవీ శాఖలో 1,393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి కూడా త్వరలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. రాష్ట్రంలో 6 వేలకుపైగా ఖాళీల భర్తీకి చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు
తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన టీజీపీఎస్సీ

సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి












