కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కృష్ణా నీటి వినియోగం ఎంత జరిగింది అనే కనీస అవగాహన రేవంత్ రెడ్డికి లేకపోవడం పాలమూరుకే కాదు, యావత్ తెలంగాణకు దురదృష్టకరం అని మాజీ మంత్రి హరీష్‌రావు ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో సిఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. నీళ్ల మంత్రి ఉత్తం కుమార్ రెడ్డికి కూడా కనీస అవగాహన లేదా? అని ప్రశ్నించారు. సిఎంకు, మంత్రి ఉత్తమ్ ఇద్దరికి ప్రభుత్వం రాసిన అధికారిక లేఖల్లో ఏం ఉందో తెలియదా..? అని ఎద్దేవా చేశారు. 30 నెలలు దాటింది ఇంకెప్పుడు ఇరిగేషన్ మీద ప్రిపేర్ అవుతారు..ఈ ఏడా ది మే 2 నాడు తెలంగాణ ఇఎన్‌సి జనరల్ కృష్ణా బోర్డుకు లేఖ రాసింది నిజం అని, ఆ లేఖ ప్రకా రం, ఆంధ్రప్రదేశ్ 74.23 శాతం నీటి వాటాను, తెలంగాణ కేవలం 25.77 శాతం వినియోగించుకున్నదని చెప్పింది నిజం అని పేర్కొన్నారు.

పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్‌రెడ్డి రెండున్నరేళ్ల పాలనలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చేసిం ది గుండు సున్నా అని విమర్శించారు. 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, 1,226 గ్రామాలకు తాగునీరు అందించే పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయకుండా పాలమూరుకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా కేసులు వేయించి, ఆనాడు ప్రాజెక్ట్ పనుల పురోగతిని అ డ్డుకున్న వ్యక్తి రేవంత్‌రెడ్డి, నాటి కాంగ్రెస్ పార్టీ అ ని పేర్కొన్నారు. పాలమూరు ప్రాజెక్ట్‌కు కాంగ్రెస్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎంత మంది రైతుల ను రెచ్చగొట్టినా నాడు బిఆర్‌ఎస్ ప్రభుత్వం 27, 191 ఎకరాల భూసేకరణ చేసిందని తెలిపారు. పాలమూరు ప్రాజెక్టుకు గాను రెండున్నరేళ్ల పాలనలో ఎన్ని ఎకరాల భూమి సేకరించారో చెప్పాలని డిమాండ్ చేశారు. టిడిపి, కాంగ్రెస్ పాలనలో వలసలకు, ఆకలి చావులకు నిలయంగా మారిన పాలమూరు తలరాతను మార్చింది కెసిఆర్ అని, వలస బోయిన వాళ్లను వాపస్ తెచ్చింది కెసిఆర్ అని వ్యాఖ్యానించారు.