
కొలీజియం తీరుతోనే ఈ దుష్పరిణామాలు
ఇలాంటి వారే ప్రజా సమూహాన్ని చీమలతో పోల్చుతారు
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఎంపిక చేసే కొలీజియం వ్యవస్థపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉజ్జల్ భూ యాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించిన కొలీజియం ప్రతిపాదనల్లో కారణాలను వెల్లడించకపోవడం న్యాయమూర్తులకు అన్యాయం చేయడమే అవుతుందని అన్నారు. ‘కొలీజియం గత మూడు రిజల్యూషన్లలో ఎలాంటి కారణాలను వెల్లడించకపోవడం గుర్తించాను. ఇది జవాబుదారీతనం నుంచి ఒక అడుగు వెనక్కి మళ్లడంగా అనుకోవచ్చా’ అని జస్టిస్ భూయాన్ ప్రశ్నించారు.
లీగల్ థింగ్-ట్యాక్ విధి జల్దీ ఇనీషియేటివ్ శనివారంనాడిక్కడ ఏర్పాటు చేసిన ప్యానల్ డిస్కషన్‌లో ఆయన మాట్లాడుతూ, న్యాయమూర్తుల పదోన్నతులకు కారణాలను వెల్లడించకపోవడం వల్ల న్యాయవ్యవస్థలోకి అవాంఛనీయ వ్యక్తులు ప్రవేశించడానికి ఆస్కారం కలుగుతుందన్నారు. వారు ఆ తర్వాత ప్రజాసమూహాన్ని చీమలతో పోల్చవచ్చని, రా జ్యాంగ విరుద్ధమైన వ్యాఖ్యలు చేయవచ్చని వివరించారు. అలాంటి వ్యక్తులను న్యాయవ్యవస్థలోకి ప్రవేశించకుండా నిరోధించేందుకు తగిన చర్చలు జరపాలని, కారణాలు కూడా ఇవ్వాలని చెప్పారు. ఇటీవల ఒక హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను కూడా జస్టిస్ భూయాన్ ప్రస్తావించారు.
2024లో జరిగిన వీహెచ్‌పీ ఈవెంట్‌లో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ఒకరు ఒక వర్గానికి వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేశారని చెప్పారు. ఆయన ‘విద్వేష ప్రసంగం’పై చర్య తీసుకోవాలని కొందరు విపక్ష నేతలు డిమాండ్ చేసినట్టు తెలిపారు. ‘మన దేశంలో చిన్న జంతువులకు కూడా హాని చేయరాదని నేర్పిస్తుంటారు. చీమలకు కూడా చంపం. ఆ పాఠం మనలో జీర్ణించుకుపోయింది. బహుశా అందువల్లే మ నలో సహనం, కనికరం కనిపిస్తుంది. ఇతరులు బాధపడం చూసి మనం కూడా బాధపడతాం. మీ సంస్కృతిలో చిన్నప్పటి నుంచే పిల్లలు పశువధ చేస్తుంటారు. వారి నుంచి సహనం, కనికరం ఎలా ఆశించగలం’ అని ఒక వర్గాన్ని ఉద్దేశించి అలహాద్ హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించినట్టు జస్టిస్ భూయాన్ తెలిపా రు. కాగా, ఇటీవల కాలంలో సీజేపీ సూర్యకాంత్ కొంతమంది వ్యక్తులను ‘కాక్రోచ్’లుగా అభివర్ణించారు. ఆయన వ్యాఖ్యల అనంతరమే ‘కాక్రోచ్ జనతా పా ర్టీట పేరుతో ఆన్‌లైన్ ఉద్యమం మొదలైంది. ఇటీవల నీట్ పేపర్ లీక్ అంశంపై దేశవ్యాప్త నిరసనలకు సీజేపీ సారథ్యం వహించింది.











