
‘మంజుమ్మల్ బాయ్స్’ చిత్రంతో మలయాళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు చిదంబరం. ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘బాలన్ - ది బాయ్’. చందు సలీమ్ కుమార్, టొవినో థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఒటిటిలోకి వచ్చేందుకు సిద్ధమైంది. జులై 31 నుంచి జీ5 వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుంది.
హత్య కేసులో జైలుకు వెళ్లిన మహిళ అక్కడ ఓ అబ్బాయకి జన్మనిస్తుంది. శిక్ష పూర్తయి బయటకు వచ్చాక తన గతం గురించి ఎవరికీ చెప్పకుండా మారుపేర్లతో అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉంటుంది. కల్లోలభరితమైన బాల్యం, ఆ తర్ావత అదృశ్యమైన తన తల్లి కోసం వెతుకుతున్న ఓ టీనేజ్ అబ్బాయి కథగా ‘బాలన్ - ది బాయ్’ రూపొందింది. మే నెలలో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ సినిమాపై ప్రముఖ నటులు సూర్య, నాగచైతన్య తదితరులు ప్రశంసలు కురిపించారు.











